Home మహబూబ్‌నగర్ మనోహరంగా అంతర్జాతీయ పతంగుల పండుగ

మనోహరంగా అంతర్జాతీయ పతంగుల పండుగ

పలువురిని అకట్టుకున్న పతంగుల పండుగ
హాజరైన కలెక్టర్  రొనాల్డ్డ్ రోస్,ఎంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్

Kites

మహబూబ్‌నగర్: తెలంగాణ రా ష్ట్రంలో మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ పతంగు ల పండుగను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని య ర్‌కళాశాల మైదానంలో గురువారం అంగరంగ వైభ వంగా జరిగాయి. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ,స్థానిక ఎంఎల్‌ఎ శ్రీనివా స్ గౌడ్‌తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విదేశాల నుండి వచ్చిన అంతర్జాతీ య కైట్స్ ప్ల్లెయర్స్ వివిధ రకాల పతంగులను ఎగర వేశారు.ఈ కైట్ ఉత్సవాలకు ఇండోనేషియా, ఉక్రేన్, ఆస్టేలియా,ఇండియా పోలెండ్, స్కాట్‌లాండ్ దేశాల తో పాటు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 20 మంది ప్రొత్సహకులైన కైట్స్ ప్లయిన్ క్లబ్ మెంబర్లు అగాకాన్ అకాడమి, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దాదాపు వంద పంతంగులతో విన్యాసాలు చేశారు. మహబూబ్ నగర్ పట్టనంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన కైట్ ఉత్సవాలకు జిల్లా ప్రజలు, వివిధ కాళాశాల, పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గోని కేరింతలతో ఉల్లాసంగా విన్యాసాలను తిలకించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు సంక్రాంతి పండుగా సందర్భంగా పంతంగులను ఎంతో ఉల్లా సంగా ఎగరవేస్తారని అన్నారు. ఇటువంటి ప్రదే శంలో అంతర్జాతీయ పతాంగుల ఉత్సవాలను నిర్వ హించినట్లయితే ప్రజలను ఎంతో ఉల్లాసపర్చినట్లు అవుతుందని పర్యాటక శాఖ ఉన్నత అధికారులకు సూచించారు.

Kiteఈ ప్రదర్శనలను తక్కువ సమయంలో ఎంతో విజయవంతంగా నిర్వహించారని, ఎర్పాట్లు చాలా బాగున్నాయని అభినందించారు. 20 దేశాల ప్రజాప్రతినిధులు పాల్గోని పంతంగుల పండుగను విజయవంతం చేయడం ఎంతో సంతోషక రమన్నారు. రానున్న రోజుల్లో ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో మిని ట్యాంక్‌బండ్‌గా పాలమూర్ చెరువును ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. 300 ఎకరాల్లో పార్కు కూడ నిర్వహించడం జరిగిందన్నారు. దానిని కూడ ఆదర్శంగా తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయికి తీసుకవెళ్తానని ఎంఎల్‌ఎ అన్నారు. అనంతరం ప్రభు త్వ కళాశాల మైదానంలో పంతంగులను ఎగరవేసి విద్యార్థుతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జెసి శివకుమార్ నాయుడు, నారాయణపేట్ సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్యా, జిల్లా పర్యాటక శాఖ అధికారులు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, నాయకులు నాగేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.