Home తాజా వార్తలు సోషల్ మీడియాతో జాగ్రత్త సుమా!

సోషల్ మీడియాతో జాగ్రత్త సుమా!

Internet

 

నేటి ప్రపంచంలో ఇంటర్‌నెట్ లేకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుంది. ప్రతి చోటా మంచిచెడూ ఉన్నట్లుగానే ఇంటర్నెట్‌లోనూ మంచి చెడులకు చోటుంది. వాస్తవానికి, పూర్తిస్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారివారి పిల్లలకు చేరువచేసినట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు.

నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యవసర వస్తువులా మారిపోయింది. కొంతమంది సోషల్‌మీడియాని మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుందని కొందరి వాదన. సోషల్ మీడియాకు బానిసలు అవుతున్న యువ త సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గా ల వైపు నడిపిస్తుంది. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి.

మితిమీరిపోతున్న సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడిన యూత్ చిన్నవయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వీరితో పాటు మరికొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా అమెరికా సంస్థ చేసిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత పుస్తకాలనే మరిచిపోయిందని ఈ పరిశోధన తేల్చింది. ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు పుస్తకం అనే పదాన్నే మర్చిపోయారట. ఒకప్పుడు పుస్తకాల పురుగులుగా ఉండే యువత సోషల్ మీడియా విప్లవంతో ఆ పుస్తకాలనే పక్కనపెట్టేసి సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌కు అతుక్కుపోయినట్లు పరిశోధన వెల్లడించింది. ఇది కచ్చితంగా ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. సోషల్‌మీడియాని ఉపయోగించేవారు కొన్ని నియమాలను తమకుతాముగా పెట్టుకుని పాటిస్తే, ఇబ్బందులు కొని తెచ్చుకోరని చెబుతున్నారు నిపుణులు.

ఎవ్వరినీ నమ్మొద్దు
1. అపరిచితులతో పరిచయాలు, సోషల్‌మీడియా ద్వారా స్నేహం, ప్రేమ వంటివాటిని నమ్మొద్దు. మీ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దు. ఇంట్లో అయినా ఒంటరిగా ఉండాల్సి వస్తే తప్పనిసరిగా అవసరమైన భద్రత ఏర్పాట్లు చేసుకోండి.

2. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు, పార్టీలు వద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా ఎవరో ఒకరి సాయం తీసుకోండి.

3. ర్యాగింగ్, టీజింగ్, ప్రేమ అంటూ ఎవరైనా వెంట పడుతున్నా, మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నా, అసభ్యకరమైన సందేశాలు, మాటలు, చేష్టలతో విసిగిస్తున్నా…ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించొద్దు. ఇది ఏదో రోజు ముప్పు కలిగించొచ్చు. మీ పై అధికారులు, టీచర్లు లేదా కుటుంబ స భ్యులకు ఆ విషయం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

4. ఇతరులపై ఆధారపడటం, సానుభూతి కోరుకోవడం వల్ల మీరు బలహీనులుగా మారే ప్రమాదం ఉంది. దాన్ని దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు అవకాశంగా మలుచుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి

5. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివిస్తున్నామనుకుంటారు. అంతా స్కూలు వాళ్లే చూసుకుంటారని అనుకుంటారు. ఇంతటితో తమ బాధ్యత తీరిందనుకుంటారు. కానీ తమ పిల్లవాడు ఏం చేస్తున్నాడో, ఎలాంటి వాళ్లు స్నేహితులు ఉన్నారో కూడా తెలుసుకోరు. చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు చేతికొస్తున్నాయి. వాళ్లు ఫోనుల్లో ఏం చూస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటివారో గమనిస్తూ ఉండాలి. మానసికంగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు చూసీ చూడనట్లు వదిలేయొద్దు. కౌమారంలోకి అడుగుపెట్టినప్పుటి నుంచీ వారిలో కొత్త మార్పులు, కోరికలు పక్కదారి పట్టించొచ్చు. పరిస్థితిని గమనించుకుని మానసిక నిపుణుల్ని కలవడం మంచిది.

6. చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక ప్రవర్తన, నియమాలు అలవాటు చేయాలి. లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి. ఆడపిల్లలకి మాత్రమే హద్దులు చెప్పడం సరిపోదు. అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మెలగాలో, వారి ఆత్మాభిమానాన్ని దె బ్బతీయకుండా ఉండేందుకు ఎలా ఉండాలో చెప్పాలి.

7. పిల్లలందరికీ గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి చెప్పాల్సిందే. లేదంటే వ్యక్తిగత, శరీర భాగాలపై చేతులు వేయడం, బలవంతం చేయడం, లైంగిక చర్యకు ప్రేరేపించడం, ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలనుకోవడం వంటివన్నీ చేయొచ్చు. ఇలా చెప్పడం వల్ల వాటిని ముందే పసిగట్టి తప్పించుకోగలుగుతారు.

8. ఒంటరిగా పిల్లల్ని వదిలేయొద్దు. పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించినా, వారు ఎంత దగ్గరివారైనా సరే! వారిపై ఓ కన్నేయాల్సిందే. అలానే ఎవరినైనా చూసి చిన్నారులు భయపడుతున్నా, చదువుల్లో వెనకబడినా, దేనికైనా ఆం దోళన చెందుతున్నా తీసిపడేయొద్దు.

9. పొరబాటున మన పిల్లలే బాధితులైతే వారిని కొట్టడం, తిట్టడం సరికాదు. ముందు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే మీతో పంచుకునే చనువు వారికి మీరు ఇవ్వాలి.

10. పిల్లలకే కాదు మహిళలందరికీ ఆత్మరక్షణ విద్యలు అవసరం. స్వీయ సంరక్షణా పద్ధతులు మిమ్మల్ని ఆపత్కాలంలో ఆదుకుంటాయి. పెప్పర్ స్ప్రే, ఇతర రక్షణ పరికరాలు వెంట ఉంచుకోండి.

ఉద్యోగానికీ చేటు
సోషల్ నెట్‌వర్క్‌లో మీరు పొందుపరిచే వివరాలు మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచేలా ఉండాలి. స్నేహితులతో సంభాషణ హుందాగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివిధ సైట్‌ల్లో తప్పుడు బయోడేటాలను పెట్టకండి. చేస్తున్న ఉద్యోగం, బాస్ పట్ల మీకున్న అసహనాన్ని బహిరంగంగా పోస్ట్ చేయడం మంచిది కాదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్… లాంటి సైట్‌ల్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ని విధిగా సెట్ చేసుకోవాలి. ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్నంత మాత్రన మీకు సంబంధించిన డేటా బయటికి పొక్కదు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే… మీ నెట్‌వర్క్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఈ విషయంలో కట్టుదిట్టంగా లేకున్నా మీ గుట్టు బయటికి వచ్చేస్తుంది.

మీరెలాంటి పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు… వాటిపై మీ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయ్… లాంటి మొత్తం వివరాల్ని గ్రూపులోని ఫ్రెండ్స్ ఎకౌంట్ నుంచి సేకరించొచ్చు. మీ గురించి జల్లెడ పట్టాలనుకునే కంపెనీలు పలు రకాల టెక్నాలజీ మాధ్యమాల ద్వారా మీ ప్రొఫైల్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాయి. ఇందుకు కొన్ని అప్లికేషన్స్‌ని డెవలప్ చేసుకుంటున్నాయి కూడా. వాటితో మీ వాల్‌పై పంచుకున్న చిట్టా మొత్తం సేకరిస్తున్నారు. ఇప్పటికే మీరేదైనా కంపెనీలో ఉద్యోగులైతే, కంపెనీ క్రియేట్ చేసిన ఎఫ్‌బీ కమ్యూనిటీని విధిగా మీరూ ఫాలో అవ్వాల్సి రావొచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు కంపెనీ సోషల్ ఎకౌంట్‌ని ఫాలోయర్‌గా మారారో.. అప్పటి నుంచి మీ ఎకౌంట్‌ని కంపెనీ మానిటర్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

వ్యక్తిగతం వద్దు:
వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేసేలా పోస్టింగ్‌లు పెట్టొద్దు. ఓ సర్వేలో తేలిందేమంటే… పది మందిలో అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు, కుటుంబ వివరాల్ని, వ్యక్తిగతమైన ఫొటోలను పంచుకునేందుకు వెనకాడడం లేదు. మాటల్లో పెట్టి కొన్నిసార్లు మీరెలాంటి పాస్‌వర్డులు వాడతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు గ్రహించేలోపే మీ ప్రైవసీని మొత్తాన్ని కొల్లగొట్టేస్తారు. బీటెక్ చదివిన కుర్రాడు ఎం తో నైపుణ్యంతో వందలకొద్దీ అమ్మాయిల్ని ట్రాప్ చేసిన సంగతి, అతను ఎలా ట్రాప్ చేశాడో అనే విషయాన్ని ఈ మధ్య ఓ పోలీస్‌అధికారి చెప్పడం వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. అతను ట్రాప్ చేసినవారంతా టీనేజ్ అమ్మా యిలే. అతను లక్ష్యంగా చేసుకున్న ఏ ఒక్క అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. స్మార్ట్‌గా వాళ్లతో రిలేషన్ కొనసాగిస్తూ వాళ్లను బ్లాక్‌మెయిల్ చేశాడు. అతనికున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తోనే అమ్మాయిల సైకాలజీని అర్థం చేసుకుని నెట్టింట్లో చేసిన దందా ఇది. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిపుణులై ఉంటారు.

అన్నీ తెలుసుకుంటారిలా..
ఫ్రెండ్ రిక్వస్ట్ పంపడానికి ముందే మీ ప్రొఫైల్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. స్టేటస్ అప్‌డేట్‌లు, కామెంట్‌లు, సంభాషణల్ని వడపోస్తారు. మీపై ఓ అంచనాకి వచ్చాకే ఆహ్వానం పంపుతారు.
1. మీరు పంచుకునే ఫొటోల ఆధారంగా మీరు పేరెంట్స్‌తోనా, సింగిల్‌గా ఉంటున్నారా? అనే విషయాల్ని పసిగడతారు. సింగిల్‌గా ఇంటికి దూరంగా ఉన్నవారినే లక్ష్యంగా పెట్టుకుంటారు.
2. వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఛాట్ చేస్తున్నారంటే బాధ్యత లేకుండా ఉన్నారని గుర్తించాలి.
3. ఆలోచనలు, అభిరుచులకు మాత్రమే కట్టుబడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారి కంటూ ఎలాంటి వ్యక్తిగత అభిరుచులు లేనట్టుగా మసులుకుంటే అనుమానించాల్సిందే.
4. వ్యక్తుల ప్రొఫైల్స్, వారి మాటల్లో చేష్టల్లో ఏవైనా మోసపూరితమైనవి అనిపిస్తే వెంటనే డేటింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ నిర్వాహకులకు రిపోర్ట్ చేయండి.
5. పదే పదే ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్ అడుగుతున్నా నిరభ్యంతరంగా అన్‌ఫ్రెండ్ చేసేయండి.
6. సంభాషణల్లో ఏవైనా వెబ్ లింక్‌లను పంపుతున్నట్లేయితే క్లిక్ చేయకపోడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీ సుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అమ్మా యిలు తెలివిగా ప్రవర్తిస్తే మోసం చేసేవారే ఉండరు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం అనేది తప్పు. ఇంట్లో వారికి ప్రతి విషయాన్ని చెబుతూ వారి సలహా సంప్రదింపులు తీసుకుంటే చాలు.

Internet becomes key role in future days