Thursday, April 25, 2024

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

Interruption of fresh water supply in many places

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాటర్ సరఫరా స్కీం ఫేజ్2లో కలాబ్‌గూర్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పిఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కంది గ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈనెల 29న శుక్రవారం ఉదయం 6గంటల నుండి మరుసటి రోజు 30వ తేదీ శనివారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈపనులు కొనసాగుతాయని బోర్డు వెల్లడించింది. దీంతో మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం ఫేజ్ 2 పరిధిలోని వచ్చే పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 9: హైదర్‌నగర్, రాంనరేష్‌నగర్, కెపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్‌నగర్, ఎస్‌పీనగర్
2. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 15: మియాపూర్, దీప్తినగర్, శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీనగర్, చందానగర్
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్
4. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం 32: బొల్లారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News