Saturday, April 20, 2024

అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రేత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

interstate drug dealer arrested in hyderabad

లక్ష విలువైన డ్రగ్స్ స్వాధీనం
నిందితుడికి 600మంది కస్టమర్లు ఉన్నారు
వివరాలు వెల్లడించిన ఈస్ట్‌జోన్ డిసిపి చక్రవర్తి గుమ్మి

హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర విక్రేతను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 20ఎక్టసీ పిల్స్, 5 ఎల్‌ఎస్‌డి బోల్ట్, 4 గ్రాముల ఎండిఎంఏ, మొబైల్ ఫోన్, రూ.4,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్ డిసిపి చక్రవర్తి గుమ్మి తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోవా, అంజునా బార్డేజ్, ఆంటోని పారీస్ వడ్డోకు చెందిన ప్రీతేష్ నారాయణ్ బ్రోకర్ అలియాస్ బాబు అలియాస్ ఖాలీ డ్రగ్స్ విక్రయిస్తుంటాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ప్రీతేష్ గత ఎనిమిదేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.

గోవాలో డ్రగ్స్ విక్రయిస్తున్న మంజూర్ అహ్మద్‌తో స్నేహం చేసిన నిందితుడు ఎల్‌ఎస్‌డి బోల్ట్, ఎండిఎంఏ, చరాస్‌ను కొనుగోలు చేసేవాడు. తుకారం, సాల్‌గోవ్‌కర్, వికాస్ నాయక్, రమేష్ చౌహాన్, స్టీవ్,ఎడ్విన్ న్యూనిస్, సంజాగోవ్‌కర్ వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నాడు. ప్రీతేష్ డ్రగ్స్ విక్రయిస్తుండగా గోవా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తెలంగాణ, ఎపిలోని పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. నిందితుడు హబ్సీగూడలో కస్టమర్లకు విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడికి రెండు రాష్ట్రాల్లో 600మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో హైదరాబాద్‌లో ఉన్న 166మందిని పోలీసులు గుర్తించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై జిఎస్ డానియల్, పిసి సత్యనారాయణ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News