Home జాతీయ వార్తలు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Thievesహైదరాబాద్ : కార్ల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. మహారాష్ట్రలో వందకుపైగా కార్లను ఈ ముఠా చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. 30 కార్లను రికవరీ చేసినట్టు తెలిపారు. గ్యాంగ్ లీడర్ వంశీతో పాటు మరో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.