Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Interstate Robbery Gangయాదాద్రి భువనగిరి : అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ దోపిడీ దొంగల ముఠాను అరెస్టు చేనట్టు భువనగిరి ఎస్ఒటి పోలీసులు వెల్లడించారు. విజిలెన్స్ అధికారుల పేరుతో ఆయిల్ ట్యాంకర్ యజమానులను బెదిరించి భారీ మొత్తంలో దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన దోపిడీ దొంగల నుంచి రూ.8.8 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఒటి పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠాకు ఎపిలోని అనంతపురం జిల్లాకు చెందిన రెహ్మాన్ నాయకత్వం వహిస్తున్నాడని వారు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వారు చెప్పారు.

Interstate Robbery Gang Arrested At Yadadri Bhuvanagiri