Friday, April 19, 2024

అంతరాష్ట్ర దొంగ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

అంతరాష్ట్ర దొంగ అరెస్టు
23తులాల బంగారు ఆభరణాలు,వజ్రాలు స్వాధీనం
రూ.12లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

Interstate thief arrested in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా దొంగను నగర ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, వజ్రాలు, హోండా యాక్టివా, నగదు పదివేలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12లక్షలు ఉంటుంది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని టోలీచౌకికి చెందిన షేక్ అబ్దుల్ జఫర్ అలియాస్ అహ్మద్ అలియాస్ షఫీయుద్దిన్ అలియాస్ షాబాజ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హైదరాబాద్ 12, రాచకొండలో 14, సైబరాబాద్‌లో 38, వరంగల్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 02 చోరీలు చేశాడు. నిందితుడు ఆటోనడుపుతుండడంతో వస్తున్న డబ్బులు విలాసాలకు సరిపోవడంలేదు. దీంతో దొంగతనాలు చేయాలని ప్లాన్ వేశాడు. నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో చోరీలు చేశాడు. నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం గోల్కొండ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, వాసుదేవ్, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గొవిందు స్వామి తదితరులు పట్టుకున్నారు.

Interstate thief arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News