Home జాతీయ వార్తలు అంతర్రాష్ట్ర దొంగలముఠా పట్టివేత

అంతర్రాష్ట్ర దొంగలముఠా పట్టివేత

వివరాలు వెల్లడించిన నిజామాబాద్ రేంజ్ డీఐజీ
పరారీలో ఉన్నవారిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ
చేధించిన పోలీసు అధికారులకు రివార్డులు
THIVESనిజామాబాద్ క్రైం: తెలంగాణలో దోపిడి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు నిద్రలేకుండా చేసిన అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠాలో ముగ్గురు పట్టుబడ గా, ఆరుగురు పరారీలోఉన్నారు. పరారీలో ఉన్నవారిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. నిజామాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిజామాబాద్ రేంజ్ డీఐ జీ గంగాధర్ గురువారం మీడియా సమావేశంలో వివ రాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు బాబు, స్టోన్ కట్టర్ లక్ష్మణ్, డ్రైవర్ జోగుదండి వికాస్‌లు ఉన్నారు. బాబు మీద ఆరు నాన్‌బె యిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ముత్కేడ్‌లో ఒకటి, లిం బుగావ్‌లో ఒకటి, భాగ్యనగర్‌లో రెండు, వజీరాబాద్‌లో రెండు కేసులు ఉన్నాయి. లక్ష్మణ్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయి. లింబగావ్‌లో ఒకటి, పర్బణీలో ఒకటి, భాగ్య నగర్‌లో నాలుగు, బోకర్‌లో ఒకటి, బారాద్‌లో ఒకటి నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. పరారీలో ఉన్నవారిలో బాబు తమ్ముడు మారుతి, భీమ, దెగ్లూర్ మారుతి, చాంద్, సత్ణం సింగ్, కర్ణం సింగ్‌లు ఉన్నారు. మారుతిపై మాక్లూర్‌లో ఒక కేసు ఉంది. నిజామాబాద్ జిల్లాలో తలుపులు బద్ధలు కొట్టి దోచుకున్న సంఘటనల్లో వీరిపై 14 కేసులు ఉన్నాయి. గౌతం నగర్‌లో జూన్‌లో మారుతి కారు దొంగిలించింది బాబు బృందమే. తూఫ్రా న్‌లో జూలైలో లక్ష్మణ్ ఒక రాబరితోపాటు ఒక అమ్మా యిని అత్యాచారం చేశాడు. మాణిక్‌బండారులో ఆగస్టు లో ఒక దొంగతనం చేశారు. దెగ్లూర్‌లో ఒక దొంగతనం చేశారు.
దొంగతనం ఇలా…
పట్టుబడ్డ దొంగలు పక్కా ప్రణాళికతో చోరికి దిగుతారు. అర్థరాత్రి తలుపు తట్టి, ఇంట్లో చొరబడి, ఇంట్లో ఉన్నవా రిని బంధించి, బాత్‌రూంలో చొరగొడతారు. ఆ తర్వాత తీరిగ్గా ఇంట్లో ఉన్నదంతా దోచుకుని ఉడాయిస్తారు. ముగ్గురు బయట కాపలా ఉంటారు. మిగిలిన వారు ఇం ట్లో దోచుకుంటారు. వీరు ఎప్పుడు ఒకే స్థానంలో ఉండ రు. ఎల్లప్పుడూ సంచరిస్తుంటారు. మహారాష్ట్ర నుంచి వచ్చేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా, పోలీసుల కళ్లు కప్పి వీరు చొరబడుతుంటారు. పట్టబడ్డ దొంగల నుంచి పోలీసులు 27 తులాల బంగారం, రూ.50వేల నగదు, 2 కేజీల వెండి, ఒక మారుతి, మూడు ద్విచక్ర వాహ నాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసును చేదించిన రూరల్ సీఐ ముని, ఎస్సై రవీంద్రనాయక్‌లకు రివార్డులు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్పీ చంద్రశే ఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, డీఎస్పీ ఆనంద్‌కు మార్, రూరల్ సీఐ ముని, ఎస్సై రవీంద్రనాయక్, కాని స్టేబుళ్లు రమేష్, గఫర్, ఫిరోజ్‌ఖాన్ పాల్గొన్నారు.