Home జాతీయ వార్తలు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ARREST-2

నిజామాబాద్ : అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నుంచి 22.5 తులాల బంగారం, 30 తులాల వెండి, కారు, కెమెరా, 11 సెల్‌ఫోన్లు, ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా వీరిని అరెస్టు చేశామన్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లో కూడా చోరీలు చేశారని చెప్పారు. ఢిల్లీకి చెందిన గోవింద్ కోహ్లి, కమల్‌యాదవ్, రాజస్థాన్‌కు చెందిన కపిల్‌శర్మ, కాలూ, యుపికి చెందిన కృష్ణకుమార్ అరెస్టు అయిన వారిలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.