Home తాజా వార్తలు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Interstate Thieves Gang Arrest In Hyderabadహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుస చోరీలు చేస్తున్న ముగ్గురు సభ్యులు గల అంతర్ రాష్ట్ర దొంగలను నార్త్‎జోన్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  కొంతకాలంగా ఈ  ముగ్గురు ముఠా సభ్యులు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో శనివారం వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వీరి నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే 17 తులాల బంగారం, 2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఇతర రాష్ట్రాల్లో ఇంతకుముందు 17 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.