Home తాజా వార్తలు 2 గంటలు నవ్వుకొని వెళ్లండనేదే మా మెసేజ్

2 గంటలు నవ్వుకొని వెళ్లండనేదే మా మెసేజ్

 Ashwin Babu

 

అశ్విన్‌బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజుగారిగది ౩’. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్‌బాబుతో ఇంటర్వూ విశేషాలు…

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో…
‘రాజుగారిగది’ సినిమా చేసినపుడు పార్ట్ 2, పార్ట్ 3 చేస్తామని అనుకోలేదు. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు పార్ట్ 2కు నాగార్జున, సమంత వల్ల మంచి ఆదరణ లభించింది. నేను కూడా అందులో భాగం కావడం అదృష్టం. పార్ట్ 2లో ఎంటర్‌టైన్‌మెట్ తగ్గిందని అన్నారు. అందుకే ఇప్పుడు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పార్ట్ 3 వస్తోంది.

చాలా ఫన్నీగా…
హార్రర్ కామెడీతో వస్తున్న చిత్రం ‘రాజుగారి గది 3’. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ చిత్రం. ఇందులో సీనియర్ యాక్టర్స్ అలీ, బ్రహ్మాజీ లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు కథకు తగ్గట్లుగా సినిమా అద్భుతంగా తెరకెక్కింది.

కడుపుబ్బ నవ్విస్తారు…
ఈ సినిమాలో హార్రర్ సీన్స్ వచ్చినపుడు… ప్రేక్షకులు భయాన్ని నవ్వుగా మలుచుకుని ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు నాకు మాస్ క్యారెక్టర్ పడింది. అలీ, బ్రహ్మాజీ, ఊర్వశమ్మ, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కడుపుబ్బ నవ్విస్తారు.

అదే మా మెసేజ్…
ఈ సినిమాలో మెసేజ్ లేదు. హాయిగా థియేటర్స్‌కు వచ్చి 2 గంటలు నవ్వుకొని వెళ్లండి… అనేది ఈ సినిమాతో మేం ఇస్తున్న మెసేజ్. తొలి భాగంలో థ్రిల్ కలిగించే మెడికల్ మాఫియా… రెండో భాగంలో లేడీస్ ఇగో, బయట వాళ్ల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుంది అనేది చూపించాం. ఇప్పుడు అలా కాదు… ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు.

అందుకే తమన్నా తప్పుకుంది…
ముందు ఈ సినిమాను తమన్నాతోనే మొదలు పెట్టాం. ఓపెనింగ్ కూడా అయింది. అయితే ఆమె డేట్స్ కారణంగా తప్పుకున్నారు. అప్పటికే రెండు షెడ్యూల్స్ ఆలస్యం అయ్యాయి కూడా. అక్టోబర్‌లో విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా కోసం వేచి చూస్తే బాగోదని వదిలేసుకున్నాం. ఆమె లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం చూశాం కానీ వాళ్ల డేట్స్ కూడా కుదర్లేదు. అలాంటి సమయంలో అవికా గోర్ వచ్చింది. ఆమె సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవికా ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది.

పక్కా మాస్ క్యారెక్టర్…
ఈ సినిమాలో నా కారెక్టర్ పక్కా మాస్‌గా ఉంటుంది. నా పాత్ర కోసం నేను పూర్తిగా దర్శకుడిని ఫాలో అవుతాను. తొలి రెండు భాగాల్లో అదే చేశాను. ఇప్పుడు కూడా ఇదే చేశాను.

తదుపరి చిత్రాలు…
మూడు , నాలుగు కథలు ఉన్నాయి. ముందు అయితే గోదా అనే మళయాల సబ్జెక్ట్ విన్నాను. ఏడాదిన్నరగా అందరి హీరోల దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఛోటా కె. నాయుడు, ఓంకార్ విని ఆ తర్వాత నాకు చెబుతానని చెప్పారు.

Interview with Ashwin Babu