Home తాజా వార్తలు ‘రాగల 24 గంటల్లో’ కోసం ఎదురుచూస్తున్నా

‘రాగల 24 గంటల్లో’ కోసం ఎదురుచూస్తున్నా

director Srinivas Reddy

 

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈనెల 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వూ విశేషాలు…

స్క్రిప్ట్‌ను నమ్మి…
నేను మొదటిసారి థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా చేయడం జరిగింది. కేవలం మేము స్క్రిప్ట్‌ను నమ్మి ఈ సినిమా చేశాము. ఖచ్చితంగా మంచి సినిమా చేశాము. ఈ చిత్రం చూస్తే చివరివరకూ నెక్స్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ఉంటుంది.

కథ నచ్చి చేశాం…
నిజానికి మేము కామెడీ మూవీనే చేయాలని రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకుంటున్న క్రమంలో శ్రీనివాస్ అనే ఆయన ఈ కథ చెప్పారు. కథ బాగా నచ్చి మేము ఈ సినిమా చేశాము. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. సినిమా మొదలైన ఐదు నిమిషాల నుంచే ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా ఉంటుంది.

అందుకే ఈ టైటిల్…
కథను బట్టే ఈ టైటిల్ పెట్టాము. సినిమా మొత్తం 24 గంటల చుట్టే తిరుగుతుంది. అన్ని రకాలుగా ఆలోచించే ఈ టైటిల్ పెట్టాము. ఈ సినిమా కథ ఆరంభం భారీ వర్షం, భీభత్సమైన గాలి దుమారం నేపథ్యంలో ఉంటుంది. అప్పుడే ఓ హత్యకు సంబంధించిన వార్త వినడం, ఈ క్రమంలో సాగే పోలీస్ పరిశోధన ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం.

అద్భుతంగా నటించింది…
హీరోయిన్ ఈషా రెబ్బ ఈ సినిమాకు ముందు పది సినిమాలు వరకు చేసింది. కానీ ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఈషా రెబ్బా నయనతార స్థాయిలో అభినయాన్ని కనబరిచింది. ఆమెకు ఈ సినిమా విడుదల తరువాత మంచి పేరు వస్త్తుంది.

అతని నట విశ్వరూపం…
సత్యదేవ్ ఎంత మంచి ఆర్టిస్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సినిమాలో సత్యదేవ్ నట విశ్వరూపం ఏమిటో చూస్తారు. శ్రీరామ్ పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది.

అందుకే గ్యాప్…
‘ఢమరుకం’ సినిమా తరువాత నాగచైతన్యతో సినిమా అనుకున్నాం. ఆ సినిమా కోసం దాదాపు పది నెలలు వర్క్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు.

హత్తుకునేలా మాటలు…
కృష్ణభగవాన్ స్వతహాగా మంచి రచయిత. ఆయన ఈ సినిమాకు అద్భుతమైన సంభాషణలు రాశారు. ఆయన మాటలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటాయి.

తదుపరి చిత్రాలు…
నా వద్ద రెండు, మూడు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ‘రాగల 24 గంటల్లో’ సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నాను. ఇక ఇదే సంస్థలో రెండు వినోదాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నాను.

Interview with director Srinivas Reddy