Saturday, April 20, 2024

రెండు పాత్రలపై నిలబెట్టడం పెద్ద ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

Sharwanand

 

శర్వానంద్, సమంత జంటగా దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘జాను’. నిర్మాత దిల్ రాజు రూపొందించిన ఈ చిత్రం తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంధర్భంగా హీరో శర్వానంద్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని…
నాకు నిర్మాత దిల్ రాజు మీద నమ్మకం, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పుకాదని భావించి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమా చేయడానికి ముందు నేను కొంత ఆలోచించాను. అయితే ఈ సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని దిల్‌రాజు చెప్పి ఒప్పించారు.

క్లాసిక్ మూవీ…
ఒరిజినల్ తమిళ్ ‘96’ మూవీ నేను చూశాను. చూసిన వెంటనే నాకు ఇది క్లాసిక్ మూవీ అని అర్థమైపోయింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు.

హ్యాపీగా ఫీలయ్యా…
ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘ఇది రీమేక్‌లా లేదు. ఓ ఫ్రెష్ ఫిల్మ్‌లా ఉంది. త్రిష, విజయ్ సేతుపతి గుర్తుకు రాలేదు’అని అన్నారు. అదే మాకు వచ్చిన బెస్ట్ ఫీడ్ బ్యాక్. దీంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

అది పెద్ద ఛాలెంజ్…
దిల్ రాజు నిర్మాత కాకుండా మరొకరైతే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. సెకండాఫ్ మొత్తం రెండు పాత్రలపై నిలబెట్టడం పెద్ద ఛాలెంజ్. అది దర్శకుడు చక్కగా చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీనే కాదు రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాం అంటే ఎంటర్‌టైన్ చేసినట్టే.

ఎప్పటికీ గుర్తుపెట్టుకొనే…
హిట్స్ చాలా కొట్టొచ్చు కానీ… ఎప్పటికీ గుర్తుపెట్టుకొనే సినిమాలు కొన్ని ఉంటాయి. ప్రస్థానం, గమ్యం, ఇప్పుడు ‘జాను’… నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాలు.

తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నాను. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది.

Interview with Hero Sharwanand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News