Thursday, April 25, 2024

మనసుకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటున్నా

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna

 

నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మికతో ఇంటర్వూ…

కొత్త రష్మికను చూస్తారు…
మంచి వినోదాన్నిచ్చే చిత్రం ‘భీష్మ’. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డ్యాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు. ఇందులో కొత్త రష్మికను చూస్తారు.

ఆయన నటనంటే ఇష్టం…
సీనియర్ నటుడు అనంత్ నాగ్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన కాంబినేషన్‌లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్నాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి ఆయన అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడాన్ని బాగా ఆస్వాదించాను.

ఒక వ్యక్తి ప్రయాణం…
‘భీష్మ’ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భీష్మ’ చాలా మంచి ఫిల్మ్.

కాలేజీ ఫ్రెండ్స్‌లా…
‘అ..ఆ’ చిత్రంలో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే ఇలాంటి సినిమా చేయాలని అనుకున్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా నటించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్‌తో ఈ సినిమా చేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అతను సెట్స్‌లో ఒక కాలేజ్ బాయ్‌లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ… వెంకీతో మాట్లాడుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు నితిన్. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేమిద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.

కొత్తదనం కోసం చూస్తున్నా…
ప్రస్తుతం నేను కథకు ప్రాధాన్యమున్న పాత్రలను, మనసుకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. రెండు విషయాలను నేను నమ్ముతాను. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేట్లయినా ఉండాలి. కడుపునొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. ‘భీష్మ’ ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.

Interview with heroine Rashmika
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News