Saturday, April 20, 2024

కథ నచ్చే అక్క పాత్ర చేశా

- Advertisement -
- Advertisement -

Interview with Kajal Agarwal

 

అందాల తార కాజల్ అగర్వాల్ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కెరీర్ మొదలై 15 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ పలు హిట్ సినిమాలతో అదరగొడుతోంది ఈ స్టార్ బ్యూటీ. తాజాగా కాజల్ నటించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఛాలెంజింగ్‌గా అనిపించింది…

– ‘మోసగాళ్లు’ లాంటి సినిమాను నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కాకుండా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేయడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

థ్రిల్ అవుతారు…

– దర్శకుడు జెఫ్రి కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ముంబయ్‌లో ఉన్న అక్కాతమ్ముడు అమెరికాలో ఎలా స్కామ్ చేస్తారు? అనే విషయాన్ని వెండితెరపై చూసినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారు. నా క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను.

మాస్టర్ మైండ్ అక్కదే…

– కథ నచ్చే ఈ సినిమాలో మంచు విష్ణు హీరో పాత్రకు అక్క పాత్ర చేశాను. ఈ మొత్తం స్కామ్‌లో మాస్టర్ మైండ్ అక్కదే. కథ ప్రకారం నా పాత్రకు సినిమాలో లవ్‌ట్రాక్ లేదు. ఈ సినిమాలో నా పాత్రకు యాక్షన్ సీన్స్ లేవు. సునీల్‌శెట్టితో సీన్స్ లేవు. నవదీప్, నవీన్ చంద్రలతో కొన్ని సీన్స్ ఉన్నాయి.

భావోద్వేగానికి లోనయ్యారు…

– లెజెండరీ యాక్టర్ మోహన్‌బాబు ఈ సినిమా చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అంత గొప్ప నటుడికి ఈ సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇంగ్లీష్ వర్షన్‌కు నా వాయిస్…

— ఈ సినిమాను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో షూట్ చేశాం. కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇక పాన్ ఇండియా స్థాయిలో నా సినిమాలు కొన్ని ఇంతకుముందే విడుదలయ్యాయి. ఇక ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్‌కు నా వాయిస్ ఇచ్చాను.

కొత్త అనుభవం…

-హాలీవుడ్ దర్శకుడు జెఫ్రితో వర్క్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్స్‌ను షూట్ చేస్తే… జెఫ్రీ మాత్రం పెద్ద సీన్‌ను ఒకేసారి షూట్ చేయాలని అనేవారు. అలాగే తీశాం. ఇంకో విషయం ఏమిటంటే ఒకసారి ఇంగ్లీష్‌లో తీసిన సన్నివేశాన్ని మళ్లీ తెలుగులో షూట్ చేయాలి. కొంచెం కష్టంగా అనిపించిన కొత్త అనుభవాన్నిచ్చింది ఈ చిత్రం.

తదుపరి చిత్రాలు…

-చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్నాను. నాగార్జునతో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాను. ‘ఘోస్టీ’ అనే తమిళ సినిమాతో పాటు మరో తమిళ సినిమా చేస్తున్నాను. ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News