Saturday, April 20, 2024

మంచి సినిమాలో భాగం కావడం కోసమే చేస్తా

- Advertisement -
- Advertisement -

Mehrene

 

నాగశౌర్య, మెహరీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వద్ధామ’. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌తో ఇంటర్వూ…

యదార్థ సంఘటనల ఆధారంగా…

‘అశ్వద్ధామ’ అంటే చెడుకు వ్యతిరేకంగా నిలిచేవాడు. ఈ టైటిల్‌కి సినిమాలో వంద శాతం జస్టిఫికేషన్ ఉంటుంది. హీరో నాగశౌర్య ఫ్రెండ్ సర్కిల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఈ సినిమా నాగశౌర్యకి చాలా ముఖ్యమైనది.

మనందరిలోనూ ‘అశ్వద్ధామ’…
అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా స్పందించను. స్పందించడం వల్ల పరిష్కారాలు వస్తాయని నేను అనుకోను. నా దృష్టిలో మనందరిలోనూ అశ్వద్ధామ ఉంటాడు. తనని మనందరం బయటికి తీసుకురావాలి.

హార్ట్ టచింగ్‌గా…
ట్రైలర్‌లో చూసిన సన్నివేశం సినిమాలో చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. హీరో సోదరికి జరిగిన బాధాకరమైన సంఘటనతో హీరో ప్రయాణం మొదలవుతుంది.

ఈ సినిమా అలాంటిదే…
సినిమాలో నా క్యారెక్టర్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పలేను కానీ సినిమాలో నా పాత్ర హీరోకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక్కోసారి మన క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో భాగం కావడం కోసమే చేస్తాను. ఈ సినిమా అలాంటిదే.

గ్రిప్పింగ్ థ్రిల్లర్…
పూర్తిగా సీరియస్ సినిమా ‘అశ్వద్ధామ’. గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో కామెడీ లేదు, కమేడియన్స్ కూడా ఉండరు.

ఎలాంటి జోక్యం చేసుకోలేదు…
హీరో నాగశౌర్య కథ రాశాడు… ఆ తరువాత ఈ సినిమాలో నటించాడు. ఆ తరవాత కథనం నుంచి దర్శకత్వం వరకు చేసింది రమణతేజే. ఇందులో నాగశౌర్య ఎలాంటి జోక్యం చేసుకోలేదు.

Interview with Mehrene
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News