Thursday, March 28, 2024

7న భర్తీ కాని గ్రూప్- 2 పోస్టులకు ఇంటర్వూలు

- Advertisement -
- Advertisement -

tspsc

 

హైదరాబాద్ : గ్రూప్2లో భర్తీ కాని పోస్టులకు ఈ నెల 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఆర్థిక శాఖ, న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్ చూడాలని తెలిపింది.

4 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మూడవ విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను అనుగుణంగా ఈ నెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. షెడ్యూల్ కోసం టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.

Interviews for Group2 posts on the 7th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News