Home తాజా వార్తలు పేరుమోసిన అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు

పేరుమోసిన అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు

Intestate chain snatcher arrested in Hyderabad
నిందితుడిపై 47కేసులు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్: పేరుమోసిన చైన్ స్నాచర్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, పల్సర్ బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, లాతూర్ జిల్లాకు చెందిన శంకర్‌రావు బిరాదార్ నగరంలోని కాటేదాన్‌లో ఉంటున్నాడు. నిందితుడిపై మహారాష్ట్రలో 47 చోరీ కేసులు ఉన్నాయి.

గతంలో నిందితున్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి ఎరవాడ జైలుకు తరలించారు. నెల రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి లంగర్‌హౌస్‌లో బైక్‌ను చోరీ చేశాడు. కాచిగూడ, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం శంకర్‌రావును కాచిగూడ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి పర్యవేక్షణలో నిందితులను అరెస్టు చేశారు.