Friday, April 19, 2024

మైనార్టీ జూనియర్ కాలేజీల్లో 840 జెఎల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Recruitment of 840 JL posts in Minority Junior Colleges

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి శనివారం నాడు ప్రకటన వెలువడింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 2021-,22 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 111 తెలంగాణ మైనారీటీస్ సొసైటీ జూనియర్ కాలేజీల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. అదేవిధంగా 12 టిఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ సంస్థలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుండి జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. రిక్రూట్‌మెంట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. నియామకాల కోసం సొసైటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News