Wednesday, March 22, 2023

నూతన మీసేవా కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

Mee-seva2

* జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు 

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : జిల్లాలో కొత్తగా అవసరమైన మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అర్హుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జా యింట్ కలెక్టర్, మీసేవా అడిషనల్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మునిపల్లి, పుల్కల్, అందోల్, వట్‌పల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, నారాయణ్‌ఖేడ్,కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నాగల్‌గిద్ద మండలాల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటుచేయా ల్సి ఉంటుందన్నారు. ఆసక్తి అర్హులైన అభ్యర్థులు ఆయా మండలాల్లో మీసేవా కేంద్రాల ఏర్పాటుకు ధరఖాస్తులను ఈ నెల 14 నుండి 24వ తేది వరకు కార్యాలయ పని వేళల్లో (ఉదయం 10.30 నుండి సా యంత్రం 5 గంటల వరకు) కలెక్టరేట్‌లో గల మీసేవా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు అందజేయాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News