Home సిద్దిపేట దేశానికే ఆదర్శం

దేశానికే ఆదర్శం

 IOC building works In Siddipet district

మన తెలంగాణ/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రభుత్వ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆయన పట్టణంలోని వివిధ భవనాల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. సమీకృత కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులను  పరిశీలించిన వచ్చేనెల 6 వరకు పనులు పూర్తిచేయాలని  సంబంధిత అధికారులకు, కాంట్రాక్టరుకు ఆదేశించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐఒసి భవన నిర్మాణానికి అవసరమైన అదనపు హంగులతో పాటు ప్రహరీగోడ నిర్మాణ పనులన్నీ త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ంగాపూర్‌లో నిర్మిస్తున్న జి+1 తరహాలో నిర్మిస్తున్న1250  డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి వచ్చే సెప్టంబర్ నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యంత కళాత్మకంగా నిర్మితమవుతున్న మహతీ ఆడిటోరియం పనులను కలెక్టర్ పరిశీలించారు. దాదాపు 90 శాతం పనులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు ఆయనకు వివరించారు.మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయించాలని టూరిజం శాఖ ఎస్‌ఇ మృత్యుంజయను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పట్టణానికే వన్నెతెచ్చే విధంగా రూపొందుతున్న పాండవుల చెరువు సుందరీకరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ట్యాంక్‌బండ్ సుందరీకరణలో భాగంగా నిర్మించిన ఫౌంటేయిన్, వాకర్స్ ఫుట్‌పాత్, గజ్‌బౌలీలను ఆయన పరిశీలించారు.అదే సమయంలో అటువైపు వ్యాహాళికి వచ్చిన కొందరు సందర్శకులతో కలెక్టర్ ముచ్చటించారు. అటునుంచి కలెక్టర్ నేరుగా పట్టణ నడిబొడ్డున దేశానికే ఆదర్శంగా నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయిన్ని ఆయన పరిశీలించారు. గడా ప్రత్యేక అధికారి హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కమీషనర్ కృష్ణారెడ్డి,