Saturday, April 20, 2024

ముగిసిన ఒలింపిక్స్

- Advertisement -
- Advertisement -

IOC President declares Tokyo Olympics officially over

ఘనంగా ముగింపు వేడుకలు

2024 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పారిస్
త్రివర్ణ పతాకంతో సందడి చేసిన భజరంగ్ పునియా

టోక్యో: ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో టోక్యో ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కొవిడ్ నేపథ్యంలో ఏడాది వాయిదా పడి, అసాధారణ పరిస్థితుల్లో ప్రేక్షకులను అనుమతించకుండా జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం విశేషం. గేమ్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో ఎమర్జెన్సీ పరిస్థితులు, గేమ్స్ విలేజ్‌లో అథ్లెట్లు కొవిడ్ బారిన పడినా మొత్తానికి రెండు వారాల పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా (గుడ్‌బై) చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. ఇండియా తరఫున బ్రాంజ్ మెడల్ విన్నర్, రెజ్లర్ భజరంగ్ పునియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు. కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు.

క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో కలిసి స్టేడియంలోకి వచ్చారు. మూడేళ్ల తర్వాత 2024లో ఈ గేమ్స్‌ను నిర్వహించడానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ సిద్ధమవుతోంది. పారిస్ వేదికగా జరగబోయే తదుపరి ఒలింపిక్స్‌కు సంబంధించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించారు. చివరగా ఒలింపిక్స్ టార్చ్‌ని పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందజేయడంతో వేడుకలు ముగిశాయి. క్లోజింగ్ సెర్మనీ సందర్భంగానే మెన్స్, వుమెన్స్ మారథాన్ విజేతలకు మెడల్స్ అందజేశారు. కెన్యాకు చెందిన పెరెస్ జెప్చిర్చిర్ మహిళల మారథాన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కెన్యాకే చెందిన బ్రిగిడ్ కోస్గీ, మూడో స్థానంలో మోలీ సీడెల్ నిలిచింది. ఇక పురుషుల మారథాన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు కెన్యాకు చెందిన కిప్చోగె. నెదర్లాండ్స్‌కు చెందిన నగీయె, బెల్జియంకు చెందిన అబ్ది రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News