Home కెరీర్ ఐఒసిఎల్ లో 1574 పోస్టులు…

ఐఒసిఎల్ లో 1574 పోస్టులు…

IOCL

 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డివిజన్లలో టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తూ చేసుకోవచ్చాని సంస్థ వెల్లడించింది. ఈ రెండు కేటగిరీల్లో మొత్తం 1574 పోస్టులు ఖాళీగా ఉండగా… ట్రేడ్ అప్రెంటిస్ లో 828 పోస్టులు ఉండగా… టెక్నీషియన్ అప్రెంటిస్ లో 746 పోస్టులు ఉన్నాయి. 31-10-2019 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, పదోతరగతి మార్కుల జాబితాలో ఉన్న వయస్సును మాత్రవేు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చాని, ఈ నెల 24వ తేదీన రాతపరీక్ష నిర్వహించి… 29న ఫలితాలు, 04న డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు సంబంధింత అధికారులు వెల్లడించారు.

IOCL Released Vacancy of 1574 Posts