Home IPL 2019 బెంగళూరుపై ఢిల్లీ విజయం

బెంగళూరుపై ఢిల్లీ విజయం

 

బెంగళూరు: ఐపిఎల్ 2019లో భాగంగా చిన్నసామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. బెంగళూరు నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(67) అర్ధశతకంతో మెరిశాడు. కొలిన్‌ ఇంగ్రామ్‌(22), పృథ్వీ షా(28), రిషభ్‌ పంత్‌(18) పరుగులతో రాణించారు. కాగా, బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ లు ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

IPL 2019: DC won by 4 wickets on RCB