Home తాజా వార్తలు IPL 2019: 10 మందికి గుడ్‌బై చెప్పిన ముంబయి

IPL 2019: 10 మందికి గుడ్‌బై చెప్పిన ముంబయి

MI
న్యూఢిల్లీ: డిసెంబరులో జరగనున్న ఐపిఎల్ 2019 సీజన్ వేలంలో భాగంగా ఈ నెల 15వ తేదీ ముగిసే లోపు రిటైన్, రిలీజ్ జాబితాని ప్రకటించాలని బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. తాము అట్టిపెట్టుకుంటున్న, విడిచిపెడుతున్న ఆటగాళ్ల జాబితాని గురువారం ప్రకటించేసింది. మొత్తం 28 మందితో కూడిన ముంబయి జట్టులో 18మందిని రిటైన్ చేసుకుని ఏకంగా 10మంది ఆటగాళ్లని వేలం కోసం విడిచిపెట్టేసింది. ఇందులో ఒక క్యాప్‌డ్, ఐదుగురు అన్‌క్యాప్‌డ్, నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ముంబయి ఇండియన్స్‌ జట్టును అత్యధికంగా మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ‌నే ఐపిఎల్ 12వ సీజన్‌లో మరోసారి ముంబయికి  కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కాగా, ముంబయి జట్టు అట్టిపెట్టుకున్నఆటగాళ్లల్లో రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సిద్ధేశ్, ఆదిత్య తారె, డికాక్ (వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, బెన్‌ కటింగ్, మిచెల్ మెక్లనగాన్, ఆడమ్ మిల్నే, జేసన్ ఉండగా.. విడిచిపెట్టిన ఆటగాళ్లలో సౌరభ్ తివారి, ప్రదీప్ సంగ్వాన్, మోహసిన్ ఖాన్, ఎండి నిద్ధేశ్, లుంబ, తిజిందర్ సింగ్, జెపి డుమిని, పాట్ కమిన్స్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ ఉన్నారు.
IPL 2019: mumbai indians release 10 player list