Friday, April 26, 2024

బోణీ ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

నేడు పంజాబ్‌తో ఢిల్లీ పోరు

IPL 2020 2nd match between RCB vs KXIP

 

దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు పంజాబ్‌కు స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ జట్టులో యువ క్రికెటర్లు అధికంగా ఉన్నారు. పంజాబ్‌లో కూడా అగ్రశ్రేణి క్రికెటర్లకు కొదవలేదు. యుఎఇ వేదికగా జరుగుతున్న ఈ ఐపిఎల్‌పై ఇరు జట్లు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈసారి ఎలాగైన ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలవడ ం ద్వారా ట్రోఫీ వేటకు శ్రీకారం చుట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఐపిఎల్‌లలో అంతంత మాత్రంగానే రాణించిన పంజాబ్, ఢిల్లీలు ఈసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టు కోవాలనే పట్టుదలతో ఉన్నాయి. రిషబ్ పంత్, అయ్యర్, శిఖర్ ధావన్, అలెక్స్ కారి, అజింక్య రహానె, స్టోయినిస్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో అలెక్స్ కారి మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

మరోవైపు ఎప్పటిలాగే ఢిల్లీ రిషబ్, అయ్యర్, ధావన్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది. వీరిలో ఏ ఒక్కరూ చెలరేగినా ఢిల్లీకి విజయం నల్లేరుపై నడకే. ఇక సీనియర్లు ధావన్, రహానెలు ఈ ఐపిఎల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందులో రాణించడం ద్వారా టీమిండియాలో స్థానాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నారు. ఇక ఇషాంత్ శర్మ, కగిసో రబడా, సందీప్ లమిచానె, రవిచంద్రన్ అశ్విన్, కిమో పాల్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. మరోవైపు విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే విండీస్ సంచలనం హెట్‌మెయిర్ ఉండనే ఉన్నాడు. దీంతో ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది.
రాహుల్‌పైనే భారం
ఇక పంజాబ్ మాత్రం కెప్టెన్ లోకేశ్ రాహుల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రాహుల్‌పై నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. క్రిస్ గేల్, మాక్స్‌వెల్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ జట్టులో ఉన్నారు. అంతేగాక మయాంక్ అగర్వాల్, నికోలస్ పురాన్, కరన్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మహ్మద్ షమి, కాట్రెల్, నిషమ్, ముజీబుర్ రహ్మన్, మురుగన్ అశ్విన్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో పంజాబ్ కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.

IPL 2020 2nd match between RCB vs KXIP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News