Thursday, April 25, 2024

కోల్‌కతాపై ముంబై విజయం

- Advertisement -
- Advertisement -

అదరగొట్టిన రోహిత్ సేన

అబుదాబి: ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 49 పరుగుల తేడాతో ఘణ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. ముంబై బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ కోల్‌కతాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. పాట్ కమిన్స్ (33), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30), నితీష్ రానా (24) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.
రోహిత్ జోరు..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్ (1)ను శివమ్ మావి రెండో ఓవర్‌లోనే వెనక్కి పంపాడు. అయితే తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అండతో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. ఇటు రోహిత్, అటు సూర్యకుమార్ చెలరేగడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. రోహిత్ తన మార్క్ భారీ షాట్లతో కనువిందు చేశాడు. చూడచక్కని సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. మరోవైపు సూర్యకుమార్ కూడా చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన సూర్యకుమార్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌త 28 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక, కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 54 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 80 పరుగులు సాధించాడు.

IPL 2020: MI Beat KKR by 49 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News