Saturday, April 20, 2024

నేడు కోల్‌కతా x బెంగళూరు పోరు

- Advertisement -
- Advertisement -

అబుదాబి: వరుస విజయాలతో ఇప్పటికే నాకౌట్ అవకాశాలను మెరుగు పరుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు నాకౌట్ బెర్త్ మరింత మెరుగవుతోంది. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లి, ఫించ్, దేవ్‌దూత్ పడిక్కల్ తదితరులు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇది బెంగళూరుకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. డివిలియర్స్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కోహ్లి కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఫించ్ కూడా జోరుమీదున్నాడు. పడిక్కల్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌లోనూ బెంగళూరు బాగానే రాణిస్తోంది. చాహల్, నవ్‌దీప్ సైని, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక కోల్‌కతా కూడా జోరుమీదుంది. కిందటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్, రసెల్ వంటి కీలక ఆటగాళ్లు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. ఈసారైన వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టుకు సమస్యలు తప్పక పోవచ్చు.

KKR Win by 2 Runs against KXIP

IPL 2020: RCB vs KKR Match 2020 Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News