Wednesday, April 24, 2024

ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ..

- Advertisement -
- Advertisement -

IPL 2020: RCB Win by 7 Wickets against RR

దుబాయ్ : ఎబి డివిలియర్స్ విధ్వంసంతో ఆర్‌సిబి మరో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్‌సిబి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్‌లో డివిలియ ర్స్ 22 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎబి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. మిగిలినవారిలో దేవదూత్ పడిక్కల్ 35 పరుగులు, ఆరోన్ ఫించ్ 14 పరుగులు, కోహ్లి 43 పరుగులు, గురుకీరత్ 19(నాటౌట్) పరుగులు సాధించారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాటియాలు తలో వికెట్ తీశారు. కాగా ఇన్నిం గ్స్ మధ్య ఓవర్ల వరకు బెంగళూరును కట్టడి చేస్తూ వచ్చిన రాజస్తాన్ బౌలర్లు డివిలియర్స్ విధ్వంసానికి చేతులెత్తేశారు. ముఖ్యంగా ఉనద్కత్ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు, మరో ఫోర్ బాది 25 పరుగులు రాబట్టిన ఎబి విధ్వంసానికి మారుపేరు. ఇదే ఓవర్‌లోనూ మ్యాచ్ మలుపు తిరగడం విశేషం. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్‌సిబి 12 పాయింట్లతో మూడో స్థానంలో.. ఆర్‌ఆర్ 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన రాబిన్ ఊతప్ప (41: 22 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(57: 36 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) అర్థసెంచరీతో మెరవగా, జోస్ బట్లర్(24 25 బంతుల్లో ఫోర్, సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. కాగా రాజస్థాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 100 పరుగులు దాటింది. స్మిత్, బట్లర్‌లు కలసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాహ ల్ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన స్మిత్ 17 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే స్మిత్ అవుటయ్యాడు. కాగా 19వ ఓవర్లో రాహుల్ తెవాటియా ఫోర్, సిక్సర్‌తో15 పరుగులు సాధించడంతో ఆర్‌ఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

IPL 2020: RCB Win by 7 Wickets against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News