Tuesday, April 23, 2024

సమరోత్సాహంతో పంజాబ్

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో పంజాబ్

నేడు రాజస్థాన్‌తో కీలక పోరు

IPL 2020: CSK Win by 6 Wickets against KKR

అబుదాబి: వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా ఐదు విజయాలు సాధించి పంజాబ్ ఈసారి కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాహుల్ సేన చాలా బలంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, లోకేశ్ రాహుల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కీలకమైన రాజస్థాన్ మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈసారి స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌తో కలిసి పంజాబ్‌కు శుభారంభం అందిస్తున్న మయాంక్ కిందటి మ్యాచ్‌లో ఆడలేదు. ఈమ్యాచ్‌లో మాత్రం అతను ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు పూరన్ కూడా జోరుమీదున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మన్‌దీప్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అయితే మరో స్టార్ మాక్స్‌వెల్ మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. కానీ ఇటీవల ఆడిన ఓ మ్యాచ్‌లో అతను కాస్త మెరుగ్గా ఆడాడు. ఆ తర్వాత అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సారి ఛాన్స్ లభిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్‌లోనూ పంజాబ్ బలంగా ఉంది. మహ్మద్ షమి నిలకడైన బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రవి బిష్ణోయి, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్ తదితరులు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది.

IPL 2020: CSK Win by 6 Wickets against KKR
పరీక్షలాంటిదే
మరోవైపు రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవక తప్పదు. ఇప్పటికే రాజస్థాన్‌కు ప్లేఆఫ్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. అయితే తర్వాత ఆడే రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఏదైన అనూహ్యం జరిగితే తప్ప స్మిత్ సేన నాకౌట్ రేసులో నిలువడం చాలా కష్టం. కాగా, ఆరంభంలో బాగానే ఆడిన రాజస్థాన్ ఆ తర్వాత వరుస ఓటములు చవిచూసింది. స్మిత్, బట్లర్, బెన్‌స్టోక్స్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. స్టోక్స్ ఆ మ్యాచ్‌లో అజేయ శతకంతో కదం తొక్కాడు. శాంసన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. సమష్టిగా పోరాడితే ఈ మ్యాచ్‌లో విజయం రాజస్థాన్‌కు కష్టమేమి కాదనే చెప్పాలి.

IPL 2020: RR vs KXIP Match 2020 Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News