Thursday, April 25, 2024

రాజస్తాన్ పై చెన్నై ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

మొయిన్ అల్ ఆల్‌రౌండ్‌షో.. సిఎస్‌కె జయకేతనం
డుప్లెసిస్ మెరుపులు, రాజస్థాన్‌పై చెన్నై గెలుపు

ముంబై: ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ రెండో విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 45 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. 189 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్ బట్లర్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బట్లర్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ మన్నాన్ వోహ్రా ఒక ఫోర్, సిక్స్‌తో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన బట్లర్ రెండు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 49 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక చెన్నై స్పిన్నర్లు మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. ఇద్దరు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో రాయల్స్ మళ్లీ కోలుకోలేక పోయింది.

అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన 3 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన కీలకమైన మూడు వికెట్ల పడగొట్టాడు. జడేజా, శామ్ కరన్ రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇక మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ సంజు శాంసన్ (1) పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (2), రియాన్ పరాగ్ (3) కూడా నిరాశ పరిచాడు. రాహుల్ తెవాటియా (20), ఉనద్కట్ (20) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 17 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మొయిన్ అలీ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 26 పరుగులు సాధించాడు. ధాటిగా ఆడిన రాయుడు మూడు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. చివర్లో బ్రావో వేగంగా 20 పరుగులు సాధించడంతో చెన్నై భారీ స్కోరును నమోదు చేసింది.

IPL 2021: CSK Win by 45 runs against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News