Wednesday, April 24, 2024

సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐపిఎల్‌ 2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.దీంతో చెన్నై, సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్‌ గైక్వాడ్‌(75: 44 బంతుల్లో 12 ఫోర్లు), డుప్లెసిస్‌(56: 38 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌)లు అర్ధశతకాలతో రాణించారు. సన్ రైజర్స్‌ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. సమర్థంగా ఎదుర్కొన్న చెన్నై ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను ఛేదించింది. ముఖ్యంగా చెన్నై ఓపెనర్లు బ్యాటింగ్‌ ఆకట్టుకున్నది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది.

IPL 2021: CSK won by 7 wickets against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News