Tuesday, April 23, 2024

ఐపీఎల్ ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుంది: ధవన్

- Advertisement -
- Advertisement -

IPL has tremendous impact on the Audience

 

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పావులు కదుపుతోంది. తొలుత ఈ లీగ్‌ను మార్చి 29న నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, లాక్‌డౌన్ ఉండటంతో దాన్ని ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించడంతో.. తాత్కాలికంగా లీగ్‌ను రద్దు చేశారు. అయితే ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మ్యాచ్‌లు నిర్వహించే సమస్యే లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తెలిపారు.

అయితే ఐపీఎల్ జరిగితే అది ప్రేక్షకులకు వినోదం పంచడమే కాక.. ఎంతో ప్రభావం కూడా చూపిస్తున్నట్లు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. “క్రీడా ఈవెంట్లు జరగడం ఎంతో ముఖ్యం.. దాని వల్ల వాతావరణం మారుతుంది. ఐపీఎల్ ప్రారంభం అయితే.. అది ప్రేక్షకులపై ప్రభావం చూపుతోంది. మనం అందరి భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఐపీఎల్ జరిగితే.. ప్రపంచవ్యాప్తంగా అది ఒక పాజిటివినీ వ్యాప్తి చేస్తుంది. టోర్నమెంట్ చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తారు. నేను టోర్నమెంట్ సజావుగా సాగాలని కోరుకుంటున్నా” అని శ్రీలంక మాజీ కెప్టెన్ యాంజిలో మ్యాథ్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News