Saturday, April 20, 2024

ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

IPL: today match between DC vs MI

నేడు ముంబైతో సమరం

చెన్నై : పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ ంగళవారం ముంబైతో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక ఇప్పిటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న ముంబై హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక పంజాబ్ తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించిన ఢిల్లీ కూడా మూడో గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరుమీదున్న ధావన్

ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ భీకర ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఢిల్లీ సాధించిన రెండు విజయాల్లోనూ ధావన్ కీలక పాత్ర పోషించాడు. అతను విఫలమైన ఒక మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్ చెలరేగితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. మరో ఓపెనర్ పృథ్వీషా కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో పృథ్వీషా ఉన్నాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్, స్టోయినిస్, అజింక్య రహానె తదితరులతో జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నోర్జే, అవేజ్ ఖాన్, అశ్విన్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ విజయమే లక్షంగా పెట్టుకుంది. సమష్టిగా రాణిస్తే ముంబైను ఓడించడం పంత్ సేనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నా బ్యాట్స్‌మెన్‌లు నిలకడగా రాణిస్తుండడంతో ఢిల్లీకి వరుస విజయాలు లభిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.

హ్యాట్రిక్‌పై కన్ను..

మరోవైపు ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ముంబై హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఢిల్లీపై కూడా గెలిచి మూడో విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా బౌలింగ్‌పైనే ముంబై ఆశలు పెట్టుకుంది. రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, పొలార్డ్, బుమ్రాలు అద్భుత బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌పై బౌల్ట్, బుమ్రా, రాహుల్‌లు అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జట్టుకు విజయం అందించడంలో వీరు కీల పాత్ర పోషించారు. ఈసారి కూడా బౌలర్లు జట్టుకు కీలకంగా మారారు. ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌లు కిందటి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం కూడా జట్టుకు కలిసి వచ్చే పరిణామంగా చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News