Home టెక్ ట్రెండ్స్ జెడ్3ను ఆవిష్కరించిన ఐక్యూ

జెడ్3ను ఆవిష్కరించిన ఐక్యూ

iQOO Z3 5G launched in India

 

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ కంపెనీ ఐక్యూ దేశీయ మార్కెట్లోకి ఐక్యూ జెడ్3 ఫోన్‌ను ఆవిష్కరించింది. 5జి సామర్థం, అద్భుతమైన కెమెరా టెక్నాలజీ, బలమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో వచ్చింది. సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జి 5జి మొబైల్ ప్లాట్‌ఫామ్, 55 డబ్ల్యూ ఫ్లాష్‌చార్జ్, 64 ఎంపి ఆటో ఫోకస్ మెయిన్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6జిబి + 128జిబి వేరియంట్‌కు రూ.19,990, 8జిబి + 128జిబి వేరియంట్‌కు రూ.20,990, అలాగే 8జిబి + 256జిబి వేరియంట్‌కు రూ.22,990 రేటు ఉంది. అమెజాన్, ఐక్యూ.కామ్‌లో రెండు రంగుల్లో లభిస్తోంది.

iQOO Z3 5G launched in India