Home తాజా వార్తలు రెట్టింపైన ఐఆర్‌సిటిసి షేర్లు

రెట్టింపైన ఐఆర్‌సిటిసి షేర్లు

IRCTC

 

న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సిటిసి) ఐపిఒ 112 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత లిస్టింగ్‌లోనూ సత్తా చాటింది. స్టాక్ మార్కెట్లో ఐఆర్‌సిటిసి షేర్లు రెట్టింపు ధర వద్ద ట్రేడ్ అయ్యాయి. కంపెనీ స్టాక్ బిఎస్‌ఇ, నిఫ్టీలో సోమవారం లిస్ట్ అయింది. షేర్లు రూ .644 వద్ద లిస్ట్ అయ్యాయి. 320 ఇష్యూ ధరతో వచ్చిన ఈ షేరు 101.25 శాతం ప్రీమియంతో కనిపించింది. ఈ స్టాక్ బిఎస్‌ఇలో రూ.644, నిఫ్టీపై రూ.651 గా ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ సంస్థకు చెందిన అత్యంత విజయవంతమైన కంపెనీగా ఈ షేరు నిలిచింది. మార్కెట్లో లిస్ట్ చేసిన తరువాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .10,736 కోట్లకు చేరింది.

IRCTC shares double in Stock Market