- Advertisement -
ఇంఫాల్ : మణిపూర్లో హుక్కుల కోసం పోరాటం చేసిన ఉక్క మహిళ ఇరోమ్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ఒక్రామ్ ఇబోబి సింగ్ నియోజకవర్గం తౌబాల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆమె వెల్లడించారు. మణిపూర్లో ఆర్మీ అరాచకాలు, ప్రత్యేక అధికారులకు వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల సుమారు 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేశారు. గతేడాది ఆగస్టులో దీక్షను విరమించిన ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె అక్టోబర్లో పిఆర్జెఎ అనే పార్టీని కూడా స్థాపించిన విషయం తెలిసిందే.
- Advertisement -