Saturday, March 25, 2023

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఉక్కుపాదం

- Advertisement -

meeting

*ఉక్కు, సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం
ఫిబ్రవరి 5లోగా పెరిగిన ధరలను వెనక్కి తీసుకోకపోతే అన్ని చోట్లా పనులు ఆపివేస్తామని బిల్డర్స్ అల్టిమేటం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇనుము, ఉక్కు ధరల పెంపును ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాల ని, లేనిపక్షంలో నిర్మాణంలోని అన్ని ప్రాజెక్టులనూ ఆపివేస్తామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇనుము, ఉక్కు ధరల పెంపును వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఫిబ్రవరి 5ను డెడ్‌లైన్‌గా విధిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌ఎన్.రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బి. సుగుణాకర్ రావుల అధ్యక్షతన నగరంలోని బిఎఐ కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రా జెక్టులు, భారీ నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, సాగు నీటిపారుదల ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కలెక్టరేట్ భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయా ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో ఇనుము, ఉక్కు వినియో గం గణనీయంగా పెరిగిందని, అయితే కొద్ది రోజులుగా వీటి ధరలు అమాంతంగా 60% పెరగడంతో అన్ని నిర్మా ణరంగ, ప్రాజెక్టులపై భారీగా ఆర్థిక భారం పడుతోందని అభిప్రాయపడింది. సివిల్  ఇంజినీరింగ్ కన్‌న్‌స్ట్రక్షన్ కంపెనీలు, కాంట్రాక్టర్లు ఈ భారాన్ని భరించలేని స్థాయికి చేరాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వమే కనీస ప్రాథమిక ధరను నిర్ణయించాలని ఈ సమావేశం కోరింది. నిర్మాణాల్లో ఇనుము, ఉక్కు, సిమెంట్ అతిముఖ్యమైనవని, ఆరు నెలల కిందట ఇనుము, ఉక్కు ధరలు టన్నుకు రూ. 30 వేల ఉంటే ఇప్పుడు రూ. 50 వేలకు చేరిందని, ఈ పెరుగుదలతో నిర్మాణాలను కొనసాగించలేమని బిల్డర్లు తేల్చిచెప్పారు. అంతర్జాతీయంగా ఇనుము, ఉక్కుకు డిమాండ్ పెరగడం, చైనా ప్రభుత్వం వాయు కాలుష్య కారణంగా పలు స్టీల్ ప్లాంట్లను మూసివేయడం, ఎగుమతులు క్షీణించడం, మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇనుము చైనాకు ఎగుమతి అవుతుండడం.. ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్టీల్ తయారీ దారుల ఒంటెత్తు పోకడలు, సిండికేట్‌గా రింగ్ అయి ఐరన్, స్టీల్ ధరలను ఒక్క సారిగా 60 శాతానికి పెంచి లాభాలను చూసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ఇనుము, ఉక్కు ధరల పెంపు భవన, ఇతర నిర్మాణ రంగ పరిశ్రమపై పెను విఘాతం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఇనుము, ఉక్కు ధరల పెంపుదల ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులను ఆపేలా చేసిందని బిఏఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.ఎన్ . రెడ్డి అన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని స్టీల్ ధరలను స్థిరీకరించాలని, లేదంటే సాగు నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పనుల్ని కొనసాగించడం సాధ్యం కాదన్నారు. ధరలను తగ్గించే వరకు ప్రాజెక్టుల పనులను ఆపండం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాజెక్టును చదరపు అడుగుకు రూ.800 ధరలోనే తాము చేస్తున్నామని, పెరిగిన ధరల ప్రకారం చ.అడుగుకు దీని ఖర్చు రూ.1100 కానుందన్నారు. అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్షాన్ని చేరుకోవాలంటే ధరలను తగ్గించక తప్పదన్నారు.
ధరల నియంత్రణకు కమిటిని వేయాలి
స్టీల్ ధరల నియంత్రణ, క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కచ్చితంగా ఒక కమిటిని నియమించాల్సిందిగా పరిశ్రమ డిమాండ్ చేస్తోందని బిఏఐ తెలంగాణ ఛైర్మన్ బి. సుగుణాకర్ రావు అన్నారు. లేదంటే మొత్తం పరిశ్రమే మూత పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇది రాష్ట్రం ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపనుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News