Home తాజా వార్తలు ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా…

ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా…

Ishant Sharma has been fined by the ICC for a fast bowler

బర్మింగ్‌హోమ్: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనుచితంగా ప్రవర్తించడంతో టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మకు ఐసిసి జరిమానా విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్‌ను ఔట్ చేసిన సందర్భంలో హద్దులు దాటి ఇషాంత్ సంబరాలు చేసుకున్నాడు. ఇషాంత్ అత్యుత్సాహాన్ని పరిగణంలోకి తీసుకున్న ఐసిసి అతనికి శిక్ష విధిస్తున్నట్టు వెల్లడించింది. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను అతను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్టు ఐసిసి పేర్కొంది. మ్యాచ్ తర్వాత ఇషాంత్‌ను మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ వివరణ కోరగా తాను తప్పు చేశానన్నారు. తనకు విధించిన జరిమానాను స్వీకరిస్తున్నట్టు అంగీకరించడం గమనార్హం. 3 రోజు తొలి సెషన్‌లో డేవిడ్ మలన్ వికెట్ తీసిన అనంతరం ఇషాంత్ సంబరాలు బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టేలా ఉందని మ్యాచ్ ఉన్నతాధికారులు గుర్తించారని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.