Friday, March 29, 2024

సక్సెస్ బాటలో ‘ఇష్క్’..

- Advertisement -
- Advertisement -

తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. “ప్రయోగాత్మక సినిమా ‘ఇష్క్’. ప్రేక్షకులు ఈ సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి”అని అన్నారు. హీరో తేజ సజ్జ మాట్లాడుతూ “కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తెరచుకున్న థియేటర్స్‌లో ‘ఇష్క్’ విడుదలైంది. రోటీన్‌కు భిన్నమైన ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజు, నిర్మాత వాకాడ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ishq Movie Success Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News