Home తాజా వార్తలు జైలు వార్డర్‌పై ఐసిస్ ఖైదీల దాడి

జైలు వార్డర్‌పై ఐసిస్ ఖైదీల దాడి

chanchalguda-jail

హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో వార్డర్‌పై ఐసిస్ ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. జైలు వార్డర్ భరత్‌పై ఖైదీలు ఇబ్రహీం యజ్డానీ, ఇలియాస్ యజ్డానీ, అతవుల్లా రెహ్మాన్ దాడికి దిగారు. ఈ దాడిలో భరత్ గాయపడ్డారు. గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డబీర్‌పురా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ISIS Prisoners attack on Prison Warder