మన తెలంగాణ / సిరిసిల్ల : హైదరాబాద్‌లోని మీర్ ఆలం ఈద్గా జూపార్క్ వద్ద సున్ని దావతే ఇస్లామి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల నుండి దాదాపు 200 మంది ముస్లిం మహిళలు, పురుషులు శనివారం హైదరాబాద్‌కు బస్సుల్లో తరలి వెళ్లారు. హైదరాబాద్‌లో శనివారం మహిళలకు, ఆదివారం పురుషులకు రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తారు. సిరిసిల్ల మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళలు హైదరాబాద్‌కు తరలివెళ్లడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సత్తార్, ఉపాధ్యక్షులు ఎండి ఖాజా, కార్యదర్శి ఆయాజ్ అజీం, సభ్యులు ఎండి అన్వర్, ఎండి సాజీద్, ఎంఏ సలీం,మనీ మౌళానా, మొయిజ్ మౌళానా, యాసిన్ రజా, ఎండి అహ్మద్‌లు పాల్గొన్నారు.