Friday, March 29, 2024

ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల బెయిలు!

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్‌ఇఇన్సాఫ్(పిటిఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను మరేదైనా కేసులో మళ్లీ అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అశాంతి ఏర్పడగలదని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆయనకు రక్షణ బెయిల్(ప్రొటెక్టివ్ బెయిల్) మంజూరు చేసిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.విచారణ మొదటి సెషన్‌లో ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యుల ప్రత్యేక డివిజన్ బెంచ్… మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నినాదాలు వినపడగానే విచారణను వాయిదా వేసి కోర్టు నుంచి నిష్క్రమించింది.

అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో మాజీ ప్రధానిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొన్న మరునాడే ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను స్వీకరించింది. అరెస్టు చేయబడతారా? అనే ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ ‘నేను అరెస్టు చేయబడతానని నాకు నూరు శాతం ఖచ్చితంగా అనిపిస్తోంది’ అన్నారు. ఆయనకు అనుకూలంగా కోర్టులో నినాదాలు వినిపించాక, న్యాయమూర్తి మియాంగుల్ హస్సన్ ‘ఇది అనంగీకారం’ అన్నారు. నినాదాల మధ్య ఆయన శుక్రవారం నమాజు కోసం విచారణను కొంత సేపు వాయిదా వేశారు. ఇమ్రాన్ ఖాన్ గట్టి బందోబస్తు మధ్య ఇస్లామాబాద్ హైకోర్టుకు తేబడ్డారు. పెద్ద ఎత్తున పోలీసు, పారమిలిటరీ బలగాలను కూడా మోహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News