Home జాతీయ వార్తలు న్యాయవాది ఏర్పాటుపై జాదవ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి

న్యాయవాది ఏర్పాటుపై జాదవ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి

 Islamabad High Court allows Jadhav to set up lawyer

 

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నౌకా దళ కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్ తరఫున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించే అవకాశాన్ని భారతదేశానికి ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. అయితే జాదవ్ తరఫున వాదించే న్యాయవాది పాకిస్తాన్ పౌరుడు అయి ఉండాలని పేర్కొంటూ భారత అధికారులు జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి అనుమతించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హైకోర్డు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

పాకిస్తాన్‌లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదిని నియమించడానికి భారత ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్లు పాకిస్తాన్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ విలేకరులకు తెలిపారు. కాగా, పాకిస్తాన్ న్యాయవాదుల బృందానికి సహాయకులుగా భారతీయ న్యాయవాదులకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. తన తరుఫున న్యాయవాదిని నియమించుకోవడానికి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని హైకోర్టు తెలియచేసిందని ఆయన చెప్పారు.

Islamabad High Court allows Jadhav to set up lawyer