Home తాజా వార్తలు ‘ఇస్మార్ట్ శంకర్’ ఆరోగ్యానికి హానికరం: రామ్

‘ఇస్మార్ట్ శంకర్’ ఆరోగ్యానికి హానికరం: రామ్

iSmart-Shankarహైదరాబాద్:  పూరి జగన్నాథ్‌ డైరెక్షన్ లో రామ్ హీరోగా నిర్మితమైన ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సిన్మా మరో రెండు రోజుల్లో విడుదలకు రెడీగా ఉంది. ఈ సిన్మాకు సెన్సార్‌ బోర్డ్‌ ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీనికి కారణం చిత్రంలో చిన్నారులు చూసేందుకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటమే. ఈ విషయాన్ని రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. “పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ‘ఇస్మార్ట్ శంకర్‌’ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకునేలా ‘ఇస్మార్ట్‌’గా వ్యవహరించండి” అంటూ ట్వీట్ చేశాడు. అయితే గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరపైకి వచ్చిన ‘అల్లు అర్జున్ ‘దేశముదురు’, ‘మహేశ్ బాబు పోకిరి, బిజినెస్‌ మేన్‌, సిన్మాలు ఎ సర్టిఫికెట్ తో రిలీజ్ అయి హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే.

ISmart Shankar in Real Life Are Injurious to Health