Thursday, April 25, 2024

రోదసీ సాంకేతికత అభివృద్ధిపై నిట్ రూర్కెలాతో ఇస్రో ఒప్పందం

- Advertisement -
- Advertisement -

ISRO Agreement with nit Rourkela on Space Technology Development

 

భువనేశ్వర్: స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్(స్టిక్) ఏర్పాటుకు నిట్ రూర్కెలాతో ఇస్రో అవగాహనా ఒప్పందం(ఎంఒయు) కుదుర్చుకున్నది. రూర్కెలాలో స్టిక్ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ ఇస్రో అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల తమ సంస్థలో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో నూతన అవకాశాలు ఏర్పడ్తాయని నిట్ అధికారి ఒకరు తెలిపారు. రోదసీ సాంకేతికత పట్ల ఆసక్తి ఉన్న యువ పరిశోధకులకు స్టిక్ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అందుకు అవసరమైన ప్రయోగశాలలు, సౌకర్యాలు కల్పించి, నిపుణులతో బోధన చేయిస్తామని తెలిపారు. స్టిక్ ద్వారా ఈ రంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిట్ రూర్కెలాను ఇస్రో చైర్మన్ కె.శివన్ అభినందించారు. భవిష్యత్ రోదసీ కార్యక్రమాలకు స్టిక్ నుంచి వచ్చే ఆవిష్కరణలు ఉపయోగపడ్తాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News