Thursday, April 25, 2024

నావిక్ శాటిలైట్ కౌంట్‌డౌన్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : సోమవారం జరిగే నావిగేషన్ శాటిలైట్ ప్రయోగానికి ఇస్రో సైంటిస్టుల బృందం ఆదివారం 27.5 గంటల కౌంట్‌డౌన్ ఆరంభించింది. భారత అంతరిక్ష సంస్థకు చెందిన జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిస్తారు. ఆదివారం ఉదయం సరిగ్గా 7.12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆరంభం అయింది. రెండో తరపు నావిగేషన్ శాటిలైట్ల శ్రేణిని పరీక్షించడం ద్వారా నావిక్ సేవల కొనసాగింపు దిశలో ఇస్రో చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈ శాటిలైట్‌ను ప్రయోగిస్తున్నారు. ఈ శాటిలైట్ ఎన్‌విఎస్ 01 బరువు 2,232 కిలోలు ఉంటుంది. 51.7 మీటర్ల పొడవైన జిఎఎస్‌ఎల్‌వి వాహకనౌక నుంచి దీనిని పరీక్షిస్తారు.

భారత్, చుట్టుపక్కల దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతంలో ఈ శాటిలైట్ ద్వారా వాస్తవిక కాల స్థితి, కాలమాన సేవలను అందించేందుకు వీలేర్పడుతుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 నిమిషాలకు ఈ శాటిలైట్ కక్షలోకి నిర్ణీతంగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రయోగం తరువాత దాదాపు 20 నిమిషాలకు రాకెట్ నుంచి శాటిలైట్‌ను నిర్ణీత జియోసింక్రోనస్ (జిటిఒ) కక్షలోకి దాదాపు 251 కిలోమీటర్ల ఎత్తున ప్రవేశపెడుతారని ఇస్రో వర్గాలు ఆదివారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News