Thursday, March 28, 2024

గగన్‌యాన్ తొలి హాట్‌టెస్టు సక్సెస్

- Advertisement -
- Advertisement -

Isro successfully conducts 1st hot test of Gaganyaan

బెంగళూరు: గగనయాన్‌కు సంబంధించి ఇస్రో శనివారం అత్యంత కీలకమైన సన్నాహక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గగన్‌యాన్ ఇంధన వ్యవస్థకు చెందిన సిస్టమ్ డిమాన్‌స్ట్రేషన్ మోడల్(ఎస్‌డిఎం)కు తొట్టతొలి హాట్ టెస్టు జరిపారు. అత్యున్నత ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలిచే ఈ పరీక్ష అత్యంత కీలకమైనది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ప్రపుల్సన్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి)లో 450 సెకండ్ల పాటు ఈ హాట్‌టెస్టు ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లు , ఇది విజయవంతం అయినట్లు ఇస్రో తెలిపింది. గగన్‌యాన్ యాత్రకు సంబంధించి రాకెట్‌లోని వ్యవస్థల సమర్థతకు ఈ హాట్‌టెస్టు అత్యవసరం. దీనికి సంబంధించిన అన్ని కీలక దశలను అధిగమించినట్లు బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇస్రో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై మరిన్ని హాట్‌టెస్టులు జరుగుతాయి. గగన్‌యాన్ పరీక్షకు ముందటి నిర్ధేశిత లక్షాలను విజయవంతంగా ఛేదిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News