Home జాతీయ వార్తలు మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Isro

 

25న నింగిలోకి కార్టోశాట్3 ఉపగ్రహం

బెంగళూరు: వరస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్2 ప్రయోగం చివరి దశలో విఫలమైనప్పటికీ నిరాశ చెందకుండా ఈ నెల 25న ఉదయం 9గంటల 28 నిమిషాలకు శ్రీహరి కోటలోని పతీశ్ ధావన్ అంరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి పిఎస్‌ఎల్‌విసి 47 రాకెట్ ద్వారా కార్టోశాట్3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో కి ప్రయోగించనుంది.

దీనితో పాటుగా అమెరికాకు చెందిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకు వెళ్లనుంది. కార్టోశాట్ ఉపగ్రహం హై రిజల్యూషన్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది. ఈ ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటరల ఎత్తు కక్షలో ప్రవేశపెడతారు. క్షహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి ఇది74వ రాకెట్ ప్రయోగమని ఇస్రో తెలియజేసింది.

Isro to launch Cartosat 3 on November 25