Friday, March 29, 2024

ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి1 ప్రయోగం విఫలం: ఇస్రో

- Advertisement -
- Advertisement -

 

SSLV-D1

సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్‌ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్‌.. టర్మినల్‌ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356 x 76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి1 రాకెట్‌ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్‌ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్‌ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై  ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది.

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వి డి1ను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News